కస్తూర్బాలో కలకలం.. అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం
సీసీ కెమెరాలు ఉన్నా గోడ దూకి వెళ్లిపోయినట్లు సమాచారం.. ఉదయం పోలీసులకు సమాచారం.. గాలింపు చేపట్టిన పోలీసులు.. ఆందోళనలో తల్లిదండ్రులు హన్మకొండ జిల్లాలోని శాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైనట్లు తెలిసింది… ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో ఉంటున్న 6, 7, 8వ తరగతులకు చెందిన ముగ్గురు విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో హాస్టల్ ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయినట్లు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. పాఠశాలలో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ విద్యార్థినులు ఎలా బయటకు వెళ్లగలిగారనే అంశంపై అనేక...