రోడ్డు ప్రమాదంలో లెంకాలపల్లి సర్పంచ్ మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... నర్సంపేట మండలం ఇటుకాలపల్లి నుంచి నారక్కపేట వెళ్లే మార్గంలోని బ్రిడ్జి సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సర్పంచ్ విజయలక్ష్మి, ఆమె భర్త రవీందర్‌ను ఒక గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వారిని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి...