PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 10:14 pm Posted by : PEOPLES DAIRY NEWS

హన్మకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో లింగాల కేదారి హోటల్ యజమాని మృతి

  • ఆహారం వృథా కాకూడదన్న’ కేదారి ఇకలేరు.. అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని దుర్మరణం
  • కాలిబూడిదైన లింగాల కేదారీ ఫుడ్ కోర్ట్: యజమాని మృతి, భార్య పరిస్థితి విషమం!
  • ఆహార ప్రేమికులను శోకసంద్రంలో ముంచెత్తిన ప్రమాదం.. కేదారి మృతి పట్ల స్థానికుల సంతాపం

హన్మకొండ:

హన్మకొండ అదాలత్ జంక్షన్‌లోని ప్రముఖ “లింగాల కేదారీ ఫుడ్ కోర్ట్”లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో హోటల్ యజమాని లింగాల కేదారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన కేదారి భార్యను మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో హోటల్‌లోని వంట సామగ్రి, పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన కేదారి:

“ఆహారాన్ని వృథా చేయకూడదు” అనే సంకల్పంతో హోటల్‌లో భోజనం వృథా చేస్తే రూ. 50 జరిమానా, పూర్తిగా తింటే రూ. 10 క్యాష్‌బ్యాక్ ఇచ్చే వినూత్న నిబంధన ద్వారా కేదారి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల స్థానికులు, వ్యాపారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.