PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:28 pm Posted by : PEOPLES DAIRY NEWS

మైలారం గ్రామంలో విషాదం

 

– తలసేమియాతో ఐదేళ్ల బాలుడి మృతి

– కవలల్లో ఒకరి మృత్యువాత.. మరో చిన్నారికి వ్యాధి

– వైద్య ఖర్చులు భరించలేక కుటుంబం ఆవేదన

– మరో చిన్నారిని ఆదుకోవాలని వేడుకోలు

– ప్రభుత్వం, దాతలు స్పందించాలని విజ్ఞప్తి

– చిన్నారి మృతితో మైలారంలో విషాదఛాయలు

 

పీపుల్స్ డైరీ, గణపురం: తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెంది కవల పిల్లలు తలసేమియా వ్యాధి బారిన పడ్డారు. వీరిలో ఇండ్ల సతీష్‌ కుమార్‌ (5) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కవలల్లో మరో బాలుడు శ్యామ్‌ కుమార్‌ కూడా తలసేమియాతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు చిన్నారులకు వైద్యం అందించేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్‌కుమార్‌ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం తలసేమియాతో బాధపడుతున్న మరో చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ఇండ్ల సది రజిత వేడుకున్నారు.