అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో మీసేవ సర్టిఫికెట్లు.. కొత్త పేపర్తో ఇక లామినేషన్ అవసరం లేదు!
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందజేసే మీసేవ సర్టిఫికెట్ల భద్రత, మన్నికను పెంచేందుకు కీలక అడుగు వేసింది. చిరిగిపోని, నీటిలో తడవని 15 అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన నూతన సెక్యూరిటీ పేపర్ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త మీ సేవ సర్టిఫికేట్లు ప్రభుత్వ సర్టిఫికెట్ల రక్షణ, మన్నిక, నకిలీల నిరోధమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన -జనరేషన్ సెక్యూరిటీ పేపర్ను...