హాస్పిటల్‌ను ఇల్లుగా మార్చేసిన నర్సింగ్ సూపరింటెండెంట్
ప్రభుత్వ ఆసుపత్రి ఛాంబర్‌లో కూతురి శ్రీమంతం వేడుక! మధిర: ఖమ్మం జిల్లా మధిర ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక వివాదాస్పద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆసుపత్రిలోని నర్సింగ్ సూపరింటెండెంట్ తన అధికారిక ఛాంబర్‌ను ఏకంగా సొంత ఇంటిలా మార్చేసి, నియమ నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మదగిన సమాచారం ప్రకారం.. సదరు అధికారిణి విధి నిర్వహణ సమయంలోనే (డ్యూటీ అవర్స్‌లో) తన కుమార్తె, అల్లుడికి ఆసుపత్రి లోపల వైభవంగా శ్రీమంతం వేడుకను నిర్వహించారు. ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ఆసుపత్రిలో పనిచేసే...