PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:41 am Posted by : PEOPLES DAIRY NEWS

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

రేగొండ జూన్ 22 (పీపుల్స్ డైరీ) : గోరి కొత్తపల్లి మండలం పరిధిలోని జగ్గయ్యపేట శివారులో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై రేగొండ వైపు వెళ్తుండగా జగ్గయ్యపేట శివారులోని ఒక మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్, వయస్సు 21 సంవత్సరాలు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు మరియు గాయపడిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.