రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు రేగొండ జూన్ 22 (పీపుల్స్ డైరీ) : గోరి కొత్తపల్లి మండలం పరిధిలోని జగ్గయ్యపేట శివారులో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై రేగొండ వైపు వెళ్తుండగా జగ్గయ్యపేట శివారులోని ఒక మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్, వయస్సు 21 సంవత్సరాలు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు....