PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 5:05 am Posted by : PEOPLES DAIRY NEWS

పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

నల్లబెల్లి

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

అర్ధరాత్రి 12:51 గంటలకు మృతి చెందినట్లు వైద్యుల అధికారిక ప్రకటన

అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులలో తీవ్ర విషాదం

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతివార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యశోద ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు