PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:36 pm Posted by : PEOPLES DAIRY NEWS

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పత్రికా ప్రకటన

హైదరాబాద్:

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఆరోగ్య పరిస్థితి వివరాలు:

అవయవాల పనితీరు: పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె, మూత్రపిండాల (కిడ్నీ) పనితీరు మెరుగ్గా ఉంది. మందుల సపోర్ట్‌తో బీపీ నార్మల్‌గా ఉంటూ, మూత్రవిసర్జన (యూరిన్ అవుట్‌పుట్) సరిగ్గా జరుగుతోంది.

ఊపిరితిత్తులలో చికిత్స: లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ మరియు రక్తం గడ్డకట్టడం (థ్రాంబోసిస్) వల్ల ఇబ్బంది ఏర్పడగా, రోహిణి హాస్పిటల్‌లోనే రక్తపు గడ్డను దాదాపు క్లియర్ చేశారు. మిగిలిన భాగాన్ని యశోద హాస్పిటల్ వైద్యులు తొలగిస్తున్నారు.

సిపిఆర్ (CPR) & వెంటిలేటర్: కార్డియాక్ అరెస్ట్ కావడం వల్ల వైద్యులు 9 సార్లు సిపిఆర్ చేసి, మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్‌పై హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

మెదడు స్పందన: ప్రస్తుతం ఆయనలో కంటి, చేతి కదలికలు (Eye & Hand Movements) ఉన్నందున మెదడు చురుకుగానే స్పందిస్తోంది. మెదడు పూర్తి పనితీరును సమగ్రంగా అంచనా వేయడానికి మరో 24 నుండి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుని క్షేమంగా బయటపడతారని వైద్యులు ధైర్యం వ్యక్తం చేశారు.

అపోహలు నమ్మవద్దు:
సోషల్ మీడియా మరియు పత్రికల్లో ఆయనకు ఎక్మో (ECMO) సపోర్ట్ అందిస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని, వాటిని ఎవరూ నమ్మవద్దని వైద్యులు మరియు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వైద్య బృందం ప్రతి గంటకూ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్‌డేట్స్ అందిస్తోంది.