నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పత్రికా ప్రకటన
హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి వివరాలు: అవయవాల పనితీరు: పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె, మూత్రపిండాల (కిడ్నీ) పనితీరు మెరుగ్గా ఉంది. మందుల సపోర్ట్‌తో బీపీ నార్మల్‌గా ఉంటూ, మూత్రవిసర్జన (యూరిన్ అవుట్‌పుట్) సరిగ్గా జరుగుతోంది. ఊపిరితిత్తులలో చికిత్స: లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ మరియు రక్తం గడ్డకట్టడం (థ్రాంబోసిస్) వల్ల ఇబ్బంది ఏర్పడగా,...