PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:51 am Posted by : PEOPLES DAIRY NEWS

ప్రజాసేవకు పురస్కారం.. రేగొండ ఆర్‌ఐ వెంకటేశ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు.

ప్రజాసేవకు పురస్కారం.. రేగొండ ఆర్‌ఐ వెంకటేశ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

*పీపుల్స్ డైరీ న్యూస్, రేగొండ*: విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజాసేవలో అంకితభావానికి గుర్తింపుగా రేగొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ కు ఉత్తమ ఉద్యోగి పురస్కారం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా వెంకటేశ్ పురస్కారాన్ని అందుకున్నారు. రెవెన్యూ విధుల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఈ గౌరవం దక్కినట్లు అధికారులు తెలిపారు.
రెవెన్యూ శాఖలో బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వెంకటేశ్‌ను ఈ సందర్భంగా అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు. తన సేవలను గుర్తించి పురస్కారం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్‌లో మరింత నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తానని వెంకటేశ్ తెలిపారు.