PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 11:34 pm Posted by : PEOPLES DAIRY NEWS

నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల తరలింపు..

నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల తరలింపు..

అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్..

పీపుల్స్ డైరీ. వరంగల్ క్రైమ్

వర్ధన్నపేట మండలం
నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, వాటి వినియోగం మరియు అధికారుల విధుల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామ సర్పంచ్ జక్కి అనిత* మరియు ఆమె భర్త జక్కి శ్రీకాంత్ ప్రభుత్వ ఆస్తులను తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు.
తాజాగా 2026 ఆగస్టు 31, సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ప్రభుత్వ పాఠశాలకు భవనానికి సంబంధించిన పది పీట్ల పొడవు గల రాతి పలకలు, ఒక ట్రాక్టర్ పునాది రాయి /నిర్మాణ సామగ్రి మరియు మట్టిని వ్యక్తిగత భూమికి తరలించడం జరిగింది.
ఈ తరలింపు ప్రక్రియలో గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌తో పాటు కొంతమంది గ్రామ సిబ్బందిని కూడా వినియోగించారు
అదేవిధంగా, గతంలో దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలోని సుమారు నాలుగు చెట్లను వ్యక్తిగత అవసరాల కోసం నరికి విక్రయించారు
ఇట్టి విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని చర్యలు తీసుకోవాలని
ప్రభుత్వ పాఠశాల ఆస్తులు, గ్రామ పంచాయతీ వాహనం, ప్రభుత్వ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ వనరుల వినియోగంపై మండల విద్యాశాఖ అధికారులు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో , గ్రామ పంచాయతీ అధికారులు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.