PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 9:28 am Posted by : PEOPLES DAIRY NEWS

శనిగరం శివారులో 700 ఏళ్ల నాటి చారిత్రక శివాలయం పునరుద్ధరణ పనులు ప్రారంభం

శనిగరం శివారులో 700 ఏళ్ల నాటి చారిత్రక శివాలయం పునరుద్ధరణ పనులు ప్రారంభం

నల్లబెల్లి: పీపుల్స్ డైరీ

నల్లబెల్లి మండలంలోని శనివారం గ్రామ శివారులో ఉన్న సుమారు 700 సంవత్సరాల నాటి పురాతన శివాలయానికి మంగళవారం మరమ్మతు పనులు చేపట్టారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ చారిత్రక దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు గ్రామ సర్పంచ్ ఉటుకూరి అశోక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పురోహితులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ పునరుద్ధరణ పనులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉటుకూరి అశోక్ మాట్లాడుతూ:”మన పూర్వీకులు మనకు అందించిన 700 ఏళ్ల నాటి చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత.ఎంతో మహిమాన్వితమైన ఈ శివాలయం నిర్లక్ష్యానికి గురికావడం మనకు శ్రేయస్కరం కాదు.అందుకే గ్రామ పాలకవర్గం, పెద్దలు మరియు ప్రజల సహకారంతో ఈ మరమ్మతు పనులు చేపట్టాం.ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చి, నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని, సంప్రదాయాలను అందించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం.ఈ పుణ్యకార్యంలో భాగస్వాములైన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పురోహితులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.”ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉటుకూరి అశోక్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పురోహితులు ఆలయ పనులను పర్యవేక్షించారు.గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, యువజన సంఘాల సభ్యులు హాజరయ్యారు.భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.ఆలయ గోపుర మరమ్మతులు, గర్భాలయ పునరుద్ధరణ, ప్రాకారాల నిర్మాణం చేపట్టనున్నారు.పరిసరాలను అందమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ పునరుద్ధరణ పనుల వల్ల శనిగరం గ్రామానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.ఆలయ పునరుద్ధరణకు చొరవ చూపిన సర్పంచ్ ఉటుకూరి అశోక్ బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు.