PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 9:45 am Posted by : PEOPLES DAIRY NEWS

తప్పెవరిది

*రచన -ముత్యాల రాజేందర్ తెలుగు ఉపాద్యాయుడు*

*ఎంపీయుపిఎస్ రాందాన్ తండా*

 

కలం పట్టాల్సిన చేతులు కత్తులు పడుతున్నాయి. కలంతో కాగితాలపై రాతలు రాయాల్సిన బాల్యం కడుపులో కత్తుల దించుతున్నాయి. గురువు తన గురుతర బాధ్యతను గుర్తు చేసినందుకు గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. గంజాయి మత్తులో గడిపేస్తున్న బాల్యానికి బాధ్యత ఎవరు? అది తప్పు అని చెప్పే ఉపాధ్యాయుల జీవితాలకు భరోసా ఎవరు? సిగరెట్ తాగుతున్నావన్నందుకు ఒకడు కడుపులో గుద్దుతాడు. అబ్బాయిలతో ఏం మాటలు అన్నందుకు ఒకరు అబద్ధపు మాటలు చెప్పి అన్నదమ్ముల తీసుకొచ్చి అల్లరి చేస్తారు. తమ పిల్లల కంటే ఎక్కువ కంటికి రెప్పలా చూసుకునే ఉపాధ్యాయులపై కాలనాగు వలే పగబడుతున్నారు. చదువు చెప్పే వారి పట్ల సంస్కారం ఏది ? ఓనమాలు నేర్పే వారి పట్ల ఒదిగుండడం ఎక్కడ?

కత్తులు చేతపట్టి తిరిగే వాడి భవిష్యత్తు ఏంటి,

బాల్యం బరితెగించుతుందంటే ఆ తప్పెవరిది…. పిల్లల ప్రవర్తన తీరు పసిగట్టాల్సిన తల్లితండ్రులదా?….చిన్నగా దండించినదుకు చిత్ర విచిత్రంగా చూపించే విలువగల విలేకరులదా? మత్తును గమ్మత్తుగా చూపిస్తూ విలువలు లేని విజువల్స్ తో పసి హృదయాలపై ప్రభావాలు చూపె చిత్రాలదా? సమస్యలను చూసి పరిహాసించే సమాజందా?…శిక్ష లేకుండా క్రమశిక్షణలో పెట్టాలనే చట్టందా?…. ఆయుష్ అంత పోసి అక్షర జ్ఞానం నేర్పించి అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని చూసే ఉపాధ్యాయులదా? అసలు తప్పెవరిది