తప్పెవరిది
*రచన -ముత్యాల రాజేందర్ తెలుగు ఉపాద్యాయుడు* *ఎంపీయుపిఎస్ రాందాన్ తండా* కలం పట్టాల్సిన చేతులు కత్తులు పడుతున్నాయి. కలంతో కాగితాలపై రాతలు రాయాల్సిన బాల్యం కడుపులో కత్తుల దించుతున్నాయి. గురువు తన గురుతర బాధ్యతను గుర్తు చేసినందుకు గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. గంజాయి మత్తులో గడిపేస్తున్న బాల్యానికి బాధ్యత ఎవరు? అది తప్పు అని చెప్పే ఉపాధ్యాయుల జీవితాలకు భరోసా ఎవరు? సిగరెట్ తాగుతున్నావన్నందుకు ఒకడు కడుపులో గుద్దుతాడు. అబ్బాయిలతో ఏం మాటలు అన్నందుకు ఒకరు అబద్ధపు మాటలు చెప్పి అన్నదమ్ముల తీసుకొచ్చి...