మనసున్న మారాజు శాయంపేట మండల పోలీస్ అధికారి
పీపుల్స్డైరీ–శాయంపేట
శాయంపేట మండల ఎస్సై గారికి పేరుపేరునా బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల ఆత్మకూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు శాయంపేటలో ఉన్న వాళ్ల బంధువుల ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. ఇది గమనించిన వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసినా గాని స్పందించకుండా మెసేజ్ లు పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులను నానా ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయమై శాయంపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై జె. పరమేష్ ను సంప్రదించగా మానవతా దృక్పథంతో ఎక్కడ మీరు ఏ ఊరు మీది నా వద్దకు ఎందుకు వచ్చారు. అనే మాటలు కూడా అనకుండా పిల్లలు ఎవరి పిల్లలైనా పిల్లలే వాళ్ల తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు. అని పెద్ద మనసుతోవారి ఫోన్ నెంబర్లను తీసుకుని లొకేషన్ చూసి తిరుపతిలో ఉన్నారని చెప్పారు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది బంధువులు కలిసి తిరుపతికి వెళ్లగా అక్కడ తలో దిక్కు వెతికినా గాని జాడ దొరక లేదు అంత పెద్ద ఊరిలో ఎక్కడని వెతకాలని సందేహించుకున్న టైం లో ఎస్సై ని మళ్లీ సంప్రదించగా తనకున్న పోలీస్ స్టేషన్ పరిధిని కూడా పక్కకు పెట్టి తిరుపతిలోనే కింద రైల్వే స్టేషన్ దగ్గర సీతారామచంద్ర స్వామి ఆశ్రమంలో ఉన్నారని ఖచ్చితమైన సమాచారం ఇచ్చి పిల్లలు దొరకటానికి సహకరించిన ఎస్ఐ కి పిల్లల తండ్రి వాళ్ళ బంధువులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒకరు ఉండాలని విధి నిర్వహణలో భాగంగా ఇలాంటి ఆపదలు కలిగిన తల్లిదండ్రులను వారి పిల్లలను ఆదుకోవాలని వారన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మా పిల్లలు పోయారని కనిపించడం లేదని నా వద్దకు రాగానే నాకు మీరు ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ అని అడగాలని అనిపించలేదని వాళ్ళ బాధ చూసి నాకు చాలా బాధ అనిపించి ఫోన్ నెంబర్ సహాయంతో వాళ్లకు అడ్రస్ చెప్పడం జరిగినదని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై కి పలువురు అభినందనలు తెలియజేశారు. వీరిలో లోకల బోయిన, కుమారస్వామి. బిజెపి బీసీ సెల్ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు, రాజు జంగా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
