*”స్టెతస్కోప్ చేతిలో… సేవ గుండెల్లో – 40 ఏళ్ల అటవీ వైద్యుని యజ్ఞం”*

*"స్టెతస్కోప్ చేతిలో... సేవ గుండెల్లో - 40 ఏళ్ల అటవీ వైద్యుని యజ్ఞం"* *పిడుగులు, అడవి జంతువులను దాటి నక్సల్ కాలంలోనూ ఆగని వైద్యం* *వరంగల్, నల్లబెల్లి:శనిగరం* ఎంబిబిఎస్ డిగ్రీ లేదు. పెద్ద హాస్పిటల్ లేదు. కోట్లు లేవు. కానీ మూడు తరాల ప్రజల గుండెల్లో *"డాక్టర్ సార్"* గా నిలిచాడు. స్టెతస్కోప్ ఒక చేతిలో, ఒకప్పుడు ప్రాణరక్షణ కోసం గన్ మరో చేతిలో పట్టి, నేడు పక్షవాతంతో ఒంటి చేత్తోనే రోగులకు సేవ చేస్తున్నాడు. అతనే వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం *శనిగరం...