PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 12:57 pm Posted by : PEOPLES DAIRY NEWS

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో రైలు ఢీకొని టీచ‌ర్ మృతి

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో(Mahabubabad) విషాదం చోటు చేసుకుంది. పుష్‌పుల్ రైలు ఢీకొని(Train accident) ఉపాధ్యాయుడు దుర్మ‌ర‌ణం(Teacher dies)చెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌లో మ్యాథ్స్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్న ఎండీ గౌస్‌మియా మ‌హ‌బూబాద్ రైల్వే స్టేష‌న్‌లో ప‌ట్టాలు దాటుతుండ‌గా రైలు ఢీకొని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గౌస్‌మియా మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం తెలిపారు.