బడికి రాని టీచర్లపై వేటు!
*బడికి రాని టీచర్లపై వేటు!* *ఏడాది అబ్సెంట్ అయితే డిస్మిస్..!* *5 ఏళ్లు దాటితే రాజీనామాగా పరిగణన!* ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు సక్రమంగా రాకుండా డమ్మీలు కొడుతున్న టీచర్లు, సిబ్బందిపై విద్యాశాఖ కొరడా ఝళిపించింది. అనుమతి లేకుండా ఏడాది పాటు డ్యూటీకి రాకపోతే నేరుగా ఉద్యోగం నుంచి తొలగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. *5 ఏళ్లు దాటితే ఆటో రిజైన్!* ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగికైనా 5 ఏళ్లకు మించి సెలవు ఇవ్వడానికి అవకాశం...