బ్రేకింగ్ మోజు.. బాధ్యత మరిచిన మీడియా!
*బ్రేకింగ్ మోజు... పెద్దింటి శోకం!* *ముందు చెప్పడం కాదు... సరిగ్గా చెప్పడమే జర్నలిజం!* *సోషల్ మీడియా వార్తలే ఆధారమా? పాత్రికేయానికేం పట్టింది గతి!* *నిర్ధారణ లేని వార్తలు: సమాజానికి, మీడియాకు ముప్పు* *వ్యూస్ కావాలి... ప్రాణం ఉన్నా చంపేస్తారు!* వేగమే లక్ష్యంగా మారిన డిజిటల్ యుగంలో కొన్ని మీడియా సంస్థలు ధృవీకరణ కంటే “మొదట వార్త ఇవ్వాలి” అనే పోటీకే ప్రాధాన్యం ఇస్తుండడం మరోసారి చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైన ఘటనలో వైద్యుల అధికారిక ప్రకటనకు...