ముగ్గురు పసికందులు మృతి
ముగ్గురు పసికందులు మృతి వెంటిలేటర్ పేలి విషాదం మహారాష్ట్రలోని అమరావతి ఆస్పత్రిలో ఘటన పీపుల్స్డైరీ–అమరావతి : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆసుపత్రి మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్‌సీయూ)లో వెంటిలేటర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ సుమారు 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం కారణంగా వార్డులో దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరాడక ముగ్గురు నవజాత శిశువులు మృతి...