మెగా టెక్స్‌టైల్ పార్కులో విషాదం..
గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఇవాళ (గురువారం) విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అభిలాష్ (30), సూర్యప్రకాశ్ (31)గా మృతులను గుర్తించారు. అయితే, వారిద్దరూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు...