గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
– గణపురంలో రూ. 2.70 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం
గణపురం, జూలై 9 (పీపుల్స్ డైరీ):
గణపురం మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం ప్రారంభించారు. సుమారు రూ.2.70 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. మైలారంలో రూ.9 లక్షలు, గాంధీనగర్‌లో రూ.35.80 లక్షలు, కర్కపల్లిలో రూ.12 లక్షలు, లక్ష్మారెడ్డిపల్లిలో రూ.25 లక్షలు, బుర్రకాయలగూడెంలో రూ.10 లక్షలు, గణపురం మండల కేంద్రంలో రూ.29 లక్షలు, ధర్మారావుపేటలో రూ.10 లక్షలు, అప్పయ్యపల్లి మండల పరిషత్ పాఠశాలలో రూ.10 లక్షలు, సీతారాంపురంలో రూ.12.80 లక్షలు, బుద్ధారంలో రూ.16.50 లక్షలు, చెల్పూర్‌లో రూ.75 లక్షలు, బసవరాజుపల్లిలో రూ.25.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పనులు పూర్తికావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అడ్లూరి రాజేశ్వర రావు, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, సర్పంచ్ లు కటుకూరి రాధిక శ్రీనివాస్, సంపత్ రెడ్డి, ఇంజపెల్లి శ్రీనివాస్, భూక్య సమ్మయ్య, విడిదినేని శ్రీలత అశోక్, తోట రాకేష్, ఎలుకపెళ్లి రమేష్, పూజరి రాజేందర్, చింతకుంట్ల సునీత శ్రీనివాస్, కావటి రజిత రవీందర్, ఉప సర్పంచ్ లు పొనగంటి మలహాల్ రావు, కనిపర్తి వినయ్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ తాళ్లపెళ్లి భాస్కర్ రావు, నాయకులు కొత్త వెంకన్న, లక్కం రాములు సూరినేని సంపత్ రావు, మార్నేని ఉపేందర్ రావు, పంచమనేని తిరుమల్ రావు, బొల్లెడ్ల ప్రభాకర్ రెడ్డి, కాంతాల సమ్మిరెడ్డి, కాల్వ రాంరెడ్డి, ఓద్దుల అశోక్ రెడ్డి, చోటే మియా, పెంట చిరంజీవి ఇమ్మడి వెంకటేశ్వర్లు, పిడిశెట్టి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
