ఐసెట్ కౌన్సిలింగ్ కేంద్రంలో ‘విద్యుత్’ ఘోరం: నిలిచిపోయిన సర్వర్లు.. ఉక్కపోతతో విద్యార్థుల నరకయాతన.. పట్టించుకోని కళాశాల యాజమాన్యం!

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ నిలిచివేత: 'ఐసెట్' కౌన్సిలింగ్‌కు వచ్చిన విద్యార్థుల తీవ్ర అవస్థలు వరంగల్  పీపుల్స్ డైరీ వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కౌన్సిలింగ్ కేంద్రంలో శనివారం తీవ్ర గందరగోళం నెలకొంది. కళాశాలలో ఉదయం నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఐసెట్ (ICET) కౌన్సిలింగ్ కోసం వచ్చిన వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు. దూర ప్రాంతాల నుండి ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులు, కరెంట్ లేకపోవడంతో గంటల తరబడి పడిగాపులు...