
₹ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కీసరలో భారీగా కల్తీ పన్నీర్ పట్టివేత*
మేడ్చల్, జూలై 29(పీపుల్స్ డైరీ):- మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ (SOT) పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో భారీగా కల్తీ పన్నీర్ పట్టుబడింది. చర్లపల్లి నుంచి నాగారం శ్రీకాకుళం బస్తీ రోడ్డుమార్గంగా రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న కల్తీ పన్నీర్‌ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కల్తీ పన్నీర్ సుమారు 400 నుంచి 600 కిలోల వరకు ఉంటుందని ప్రాథమిక సమాచారం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ కల్తీ పన్నీర్‌ను మార్కెట్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు ఆటోలను, కల్తీ పన్నీర్‌ను కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, తయారీ కేంద్రాలు, సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు ప్రారంభించారు. కల్తీ పన్నీర్ ఎక్కడ తయారైంది, ఎక్కడికి సరఫరా చేయాలనుకున్నారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
