– యువకుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన
– కాజీపేట రైల్వే స్టేషన్‌లో చివరిసారిగా కనిపించినట్లు సమాచారం
పీపుల్స్ డైరీ, గణపురం:
గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి విష్ణువర్ధన్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ నెల 26వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని కళాశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన విష్ణువర్ధన్ కళాశాలకు చేరుకోలేదు. ఉదయం 11 గంటల సమయంలో కాజీపేట రైల్వే స్టేషన్‌లో తన కళాశాల స్నేహితుడికి కనిపించినట్లు సమాచారం. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విష్ణువర్ధన్ ఆచూకీ తెలిసినవారు లేదా ఎక్కడైనా కనిపించినవారు వెంటనే 9866333740, 9866052254 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
