నల్లబెల్లి, మే 30: నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శనివారం నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉ ప సర్పంచ్‌తో పాటు నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల సాధికారతకు, వారి సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.



