ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeరాజకీయంనల్లబెల్లిలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు! 🎂🧡

నల్లబెల్లిలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు! 🎂🧡

📰 Generate e-Paper Clip

పీపుల్స్ డైరీ జూలై 11 నల్లబెల్లి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలో వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.బండి సంజయ్ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటూ నల్లబెల్లి మండల కేంద్రంలోని రామాలయం, శివాలయాలలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.”బండి సంజయ్ దేశ, రాష్ట్ర సేవలో, party బలోపేతంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న నాయకత్వం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.”ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి, సింగిరెడ్డి యాదగిరి, మండల కార్యదర్శి ఓదెల అశోక్, కోశాధికారి మురికి మనోహర్, మండల నాయకులు కొండ్ల రమేష్, తిమ్మాపురం శివ, ధర్మారం క్రాంతికుమార్, కక్కెర్ల సురేష్, ఈర్ల రవి, భూమా నరేష్, జన్ను మధు, కొలిపాక దేవేందర్, చెంచు కుమారస్వామి, బానోతు శివ, హుసేన్, కిషన్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!