రేపు నల్లబెల్లి పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
నల్లబెల్లి, జూలై 10:
రేపు శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని విద్యుత్ శాఖ ఇంచార్జి అసిస్టెంట్ ఇంజనీర్ (AE) మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు.11/07/2026 (రెండవ శనివారం) సబ్ స్టేషన్‌లో అత్యవసర నిర్వహణ మరియు మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 11:30 గంటల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వివరించారు.విద్యుత్ వినియోగదారులు ఈ సమయాన్ని గమనించి, పనులకు అంతరాయం కలగకుండా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని మరియు అధికారులకు సహకరించవలసిందిగా కోరారు.
