ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeభూపాలపల్లిభూకబ్జాదారుల ద్విపాత్రాభినయం?

భూకబ్జాదారుల ద్విపాత్రాభినయం?

📰 Generate e-Paper Clip

🔥భూకబ్జాదారుల ద్విపాత్రాభినయం?

 🔥 ద్వి ముఖాలతో సామాన్యుల పై భూకబ్జాలు?

🔥ఒకవైపు సమాజ సేవ… మరోవైపు సామాన్యుడి కడుపుకోత!

🔥సరిహద్దుల్లో దేశ రక్షణ చేసిన వారు ఒకరు?

 🔥భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వ ఉపాధ్యాయడు మరొకరు?

పీపుల్స్ డైరీ సెప్టెంబర్19( గణపురం)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగo చేసి రిటైర్ అయి ఉన్న ఒక ఆర్మీ ఆఫీసర్, ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఒక ఉపాధ్యాయుడు ఈ ఇద్దరు వ్యక్తులు కలసి తమ భూములను కాజేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దేశ రక్షణ కొరకు సరిహద్దులో దేశాన్ని కాపాడానని పదవి విరమణ పొంది ఎక్స్ సర్వీస్ మెన్ కింద విధులు నిర్వహించి ప్రభుత్వం దగ్గర నుండి ఎంతో విలువైన ఐదు ఎకరాల భూమిని పొంది అది చాలదన్నట్టు పక్కన ఉన్న దళిత మహిళా భూమిని కాజేసిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఒకరైతే భవిష్యత్తును తీర్చి దిద్దే ఎంతో విలువైన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో మరొకరు ఉంటూ పిల్లలకు నీతులు బోధించి సక్రమ మార్గంలో నడిపించే ఉపాధ్యాయుడే తన తెలివితేటలతో ఒక సామాన్యుని ఇంటి స్థలం హస్తగతం చేసుకున్న తీరు చూస్తుంటే ఆ ఇద్దరి అన్నదమ్ముల అక్రమ ‘గారడి ఎంత ఉందో ఆ గ్రామంలో నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఒక సర్వే నంబర్‌తో వేర్వేరు చోట్ల, వేరు వేరు శాఖల అధికారుల దగ్గర,వేర్వేరు కొలతలతో అధికారుల కళ్ళు గప్పి ఒక దళిత మహిళ రైతు భూమిని కబ్జా చేస్తున్న మాయాజాలం ఒకరిది అయితే మరొకరుతమ తాతగారి పాత ఇంటి నంబర్‌ను వాడుకుని  గతంలో ముందే రిజిస్ట్రేషన్ అయిన ,గ్రామ పంచాయతీ  పర్మిషన్ కలిగిన ప్రస్తుతానికి కూడా కోర్టు వివాదంలో ఉన్న ఒక సామాన్యుని ఆరు గుంటల ఇంటి స్థలాన్ని   మరల దొంగ రిజిస్ట్రేషన్ దొంగ పరిమిషన్ తీసుకొని కబ్జా చేశారు.వంశపారంపర్య భూమి అంటూ ఒకరు నాటకం. మరొకరు ఎన్నో ఏళ్లుగా వేరొకరి పేరు మీద ఉన్న సర్వే నంబర్‌ను తమ వంశపారంపర్య భూమి అని బుకాయిస్తూ ఆక్రమణకు పాల్పడ్డారు. ఇంత అన్యాయం జరుగుతున్న గ్రామంలోని కొందరు పెద్దలు ఈ అన్యాయం అడ్డుకట్ట వేయకపోగా ఆక్రమణదారులకి సలహాలు సూచనలు ఇస్తూ వారి ఆక్రమణలో పాలుపంచుకుంటున్నారని ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఆ గ్రామంలోని కొందరు పెద్దలు ఆ ఊరిని సైతం మేమే రూపొందించామని చెప్పుకుంటూ ఆక్కడ ఏ సమస్యలు జరిగిన అందులో తలదూర్చుతూ భూ సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామ పెద్దమనుషుల చెలామని అవుతున్న వారు సామాన్యు ల భూములను ఆక్రమించుకుంటున్న ఈ ఇరువురు పేద్దమనుషులు కూడా ఓకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వలన వీరి కబ్జాలకు మరింత బలం చేకూర్చింది అని ఆ గ్రామంలో చర్చ బాగానే వినిపిస్తుంది.అసలు ఈ  రవి శేషనాగుల కబ్జా పర్వానికి తెరలేపిన ఆ సర్వే నెంబర్ ఏంటి? అక్రమ పర్మిషన్ పొందిన ఆ ఇంటి నెంబర్ ఏంటి? అనే పూర్తి ఆధారాలతో మీ పీపుల్స్ డైరీ దినపత్రికలో (వచ్చే సంచికలో)

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!