ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్నర్సంపేటలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు:

నర్సంపేటలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు:

📰 Generate e-Paper Clip

 

నర్సంపేట నియోజకవర్గంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ దేశ, రాష్ట్ర సేవలో, పార్టీ బలోపేతంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి, మారుమూల తండాలకి తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న నాయకత్వం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డెపెల్లి నర్సింహా రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి, యువ మోర్చా జిల్లా నాయకులు జూలూరి మనీష్, కుంభం కోమల్ రెడ్డి, అచ్చ దయాకర్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ ఖలీల్, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ దుంకదువ్వ రంజిత్, సూత్రపు సరిత మరియు వివిధ మండలాల, మోర్చాల ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!