

*ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం*
*ఎమ్మెల్యే రాందాస్ నాయక్*
*వైరా రిజర్వాయర్ కు గోదారి జలాలు విడుదల*
ఏన్కూరు, జులై 12 (పీపుల్స్ డైరీ): రైతులు సాగు చేసిన ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.ఆదివారం ఏన్కూరు మండలం తిమ్మారావుపేట సమీపంలోని ఎన్.ఎస్.పి కాలువ ఎస్కేవు లాకుల దగ్గర ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పూజలు చేసి వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వం. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు భీమా, రుణమాఫీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలను అందించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దువ్వాళ్ళ దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్, కే.సతీష్,స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.
