ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఎడిటోరియల్గణపురంలో కొలువుదీరిన గణనాథుడు

గణపురంలో కొలువుదీరిన గణనాథుడు

📰 Generate e-Paper Clip

 

– ఘనంగా వినాయక చవితి వేడుకలకు శ్రీకారం

– మండలమంతా గణపయ్య సందడి

– ఆయా గ్రామాల్లో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనలు

– భారీ ఏర్పాట్లతో ముస్తాబైన వినాయక మండపాలు

– చిన్నారులు, యువతలో ఉత్సాహం

– విద్యుత్‌ దీపాల అలంకరణతో వెల్లివిరిసిన శోభ

 

పీపుల్స్ డైరీ, గణపురం:

 

గణపురం మండలంలో వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. పండుగను పురస్కరించుకుని గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. భారీ ఏర్పాట్ల నడుమ గణనాథుడిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపయ్యను దర్శించుకున్నారు. గణనాథుడికి పూలు, పండ్లు, ప్రసాదాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండపాల వద్ద భక్తుల కోసం ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక మండపాల వద్ద సందడి నెలకొంది. చిన్నారులు, యువత ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మండపాల వద్ద భక్తుల రద్దీ పెరుగుతుండటంతో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామాల్లోని ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ఆకాంక్షించారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!