ఆర్టీసీ నర్సంపేట డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలి
– నూతన డిపో మేనేజర్ సరస్వతి పిలుపు
నర్సంపేట: పీపుల్స్ డైరీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డిపో మేనేజర్ సరస్వతి డిపో ఆవరణలో ఉద్యోగులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో అభివృద్ధి, సేవల మెరుగుదలపై ఉద్యోగులకు పలు కీలక సూచనలు చేశారు.నర్సంపేట డిపో అభివృద్ధి చెందాలన్నా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలన్నా ప్రతి ఉద్యోగి పూర్తి బాధ్యతతో పనిచేయాలని డీఎం కోరారు.డిపో ఆర్థిక పురోగతికి, ఆదాయాన్ని పెంపొందించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యోగులందరి సహకారంతోనే డిపోను అగ్రపథంలో నిలపడం సాధ్యమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
🥛 ఉద్యోగుల సంక్షేమం – మజ్జిగ పంపిణీ
ప్రస్తుత వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగుల ఆరోగ్యం కొరకు డిపో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గేట్ మీటింగ్ అనంతరం సిబ్బంది అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ అమృత మరియు డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

