ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్నీట్-2026 ఎంట్రన్స్ ఫలితాలలో 'షైన్' విద్యార్థుల విజయకేతనం....

నీట్-2026 ఎంట్రన్స్ ఫలితాలలో ‘షైన్’ విద్యార్థుల విజయకేతనం….

📰 Generate e-Paper Clip

నీట్-2026 ఎంట్రన్స్ ఫలితాలలో ‘షైన్’ విద్యార్థుల విజయకేతనం….l

పీపుల్స్ డైరీ: 17(హన్మకొండ)

నీట్-2026 ఎంట్రన్స్ ఫలితాలలో షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలు సాధించినట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగుల రమ, అరూరి కవిత, పి. రాజేంద్రకుమార్, మూగుల రమేష్ లు సంయుక్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మూగుల కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. షైన్ విద్యాసంస్థలు మొదటి నుండి నీట్, జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్లలో అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో ఎండి అకీబ్ అలీ 504 ర్యాంకు, ఎం నళిని ప్రభాత్ 480 ర్యాంకు, టీ హాసిని 406 ర్యాంకు, ఎస్. సాయి ప్రశాంతి 396 ర్యాంకు ఉందన్నారు. వీరితోపాటు 15 మంది విద్యార్థులు 350 మార్కులకు పైగా సాధించి విజయభేరి మోగించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కుమార్ యాదవ్, యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమములో షైన్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!