
భూపాలపల్లి,పీపుల్ డైరీ (జూలై,1): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీచేశారు.ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, ఫిర్యాదుల పరిష్కారంలో బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
