ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్ముచింపుల గ్రామంలో మహిళా సంఘం (VO) భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ముచింపుల గ్రామంలో మహిళా సంఘం (VO) భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

📰 Generate e-Paper Clip

నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామంలో మహిళా సంఘం (VO) నూతన భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు.

గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి, వారి సమాఖ్య సమావేశాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ సొంత భవనం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!