ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్అర్షన్ పల్లి (బోల్లోనిపల్లి) లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

అర్షన్ పల్లి (బోల్లోనిపల్లి) లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

📰 Generate e-Paper Clip

నల్లబెల్లి: నల్లబెల్లి మండలం అర్షన్ పల్లి (బోల్లోనిపల్లి) గ్రామంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న పిల్లలకు పౌష్టికాహారం, ముందస్తు విద్యను అందించడంతో పాటు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నూతన భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!