ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeతెలంగాణపల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్

పల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్

📰 Generate e-Paper Clip

tపల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్

సైదాపూర్ (పీపుల్స్ డైరీ) : సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో కరీంనగర్ కు నూతన ఆర్టీసీ బస్సు సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. ఈ బస్సు కరీంనగర్ నుండి మానకొండూరు,ముంజంపల్లి,పోరండ్ల,మన్నెంపల్లి,మల్లాపూర్,పోలంపల్లి,మొగిలిపాలెం ,రేకొండ,బొమ్మనపల్లి,దుద్దెనపల్లి,ఎక్లాస్పూర్,సోమారం చౌరస్తా,సైదాపూర్ నుండి తిరిగి దుద్దెనపల్లి,బొమ్మనపల్లి,రేకొండ,మొగిలిపాలెం,పోలంపల్లి,మల్లాపూర్,మన్నెంపల్లి,పోరండ్ల,ముంజంపల్లి,మానకొండూరు మీదుగా తిరిగి కరీంనగర్ వరకు ప్రయాణికులకు సేవలు అందించనుందని తెలిపారు..
విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ప్రతిరోజు రాకపోకల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ సేవతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కావడంతోపాటు వారి ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారను ఉన్నాయని అన్నారు.. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల లక్షలాదిమంది మహిళలు, విద్య, ఉపాధి వ్యాపారం కుటుంబ అవసరాల కోసం ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రయాణించే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు, మహిళల ఆర్థిక సాధికారతకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని.. అంతేకాకుండా మండలంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా అనుసంధానం (కనెక్టివిటీ) కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు..తమ చిరకాల కోరికను నెరవేర్చిన గౌరవ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మండల ప్రజలు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్లు, PACS ఛైర్మన్,వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు,ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!