ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeతెలంగాణభూపాలపల్లి మండల ఆప్ అధ్యక్షుడిగా జాడి నితిన్ నియామకం

భూపాలపల్లి మండల ఆప్ అధ్యక్షుడిగా జాడి నితిన్ నియామకం

📰 Generate e-Paper Clip

పీపుల్స్ డైరీ,భూపాలపల్లి:  ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి మండల అధ్యక్షుడిగా జాడి నితిన్‌ను నియమిస్తూ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా నాగుల అరవింద్ మాట్లాడుతూ..జాడి నితిన్ గత నాలుగేళ్లుగా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి మండల అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.భూపాలపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని, రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలను సమన్వయం చేస్తూ పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా నియమితులైన జాడి నితిన్‌కు జిల్లా, రాష్ట్ర నాయకత్వం శుభాకాంక్షలు తెలిపింది.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!