ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeఎడిటోరియల్పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు.

పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు.

📰 Generate e-Paper Clip

పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు

కూడా ప్లాటింగ్ లో అవకతవకలంటూ ఒకరు

ఎటువంటి దోపిడీ అక్రమాలు జరగలేదంటూ మరొకరు

ఆలయం అపవిత్రమైందని పవిత్రం చేయటానికి మరొకరు

పవిత్రాపవిత్రాలు రాజకీయ ఆలయాల చుట్టూ చేయాలి

ఆటంకాలు కలిగిస్తూ పార్టీలను అభాసు పాలు చేస్తున్నారంటూ భక్తులు

ఆలయ పరిసరాల్లో క్షుద్ర పూజలు, ఆలయంలో కరెంట్ కట్…కారణం..?

సంఘటనలు జరుగుతుంటే చోద్యం చూస్తున్న ఆలయ అధికారులు

పీపుల్స్ డైరీ ప్రతినిధి వరంగల్

  • ఓరుగల్లు చరిత్రగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పలు రాజకీయ పార్టీ వర్గాలు స్టంట్లు చేశాయి గత ప్రభుత్వంలో కూడా ప్లాట్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ నింద వేస్తే తప్పు చేయలేదంటూ నిరూపించుకుంటానని ఉదయాన్నే తడిచిన బట్టలతో ఆలయంలో ప్రమాణం చేస్తూ ఒకరు పొరపాట్లు దొర్లాయంటూ మరొకరు భద్రకాళి ఆలయం ఇలా అపవిత్రం చేస్తారా అంటూ పవిత్రం చేయటానికి మరొకరు ఈ అనాలోచిత సంఘటన అటు పార్టీ వర్గాల్లో ఇటు భక్తుల నడుమ హాట్ టాపిక్ గా మారింది ఏదైనా తేల్చుకుంటే బాహాటంగా తేల్చుకోవాలి కానీ ఇలా భద్రకాళి ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఆటంకాలు కలిగిస్తూ పార్టీ పరువు బజారు పాలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు ఇక ముందు రోజు రాత్రి భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలంటూ ప్రచారం రాత్రి సమయంలో దాదాపు గంటల కొద్ది విద్యుత్ లేకపోవటం ఇదంతా చూస్తుంటే భక్తుల్లో ఏదో తెలియని ఆందోళన వ్యక్తం ఏర్పడింది ఇలాంటి దుశ్చర్యల వలనే ఎన్నడూ లేని విధంగా జరిగిన సంఘటనల పై పలు అనుమానాలు సైతం వ్యక్తం చేయాల్సి వస్తుంది ఇదిలా ఉండగా ఇంత రాద్దాంతం జరుగుతుంటే చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!