ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.70 వేల జరిమానా.

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.70 వేల జరిమానా.

📰 Generate e-Paper Clip

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.70 వేల జరిమానా.

పీపుల్స్ డైరీ. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్ రిపోర్టర్

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి తహసీల్దార్ రూ.70 వేల జరిమానా విధించారు.
దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 140/2026 కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న డీజే నవీన్ అలియాస్ జాటోత్ నవీన్ గత మార్చి నెలలో ఎక్సైజ్ కేసుకు సంబంధించి తొర్రూరు తహసీల్దార్ ఎదుట బైండోవర్ అయ్యాడు. అయితే తాజాగా నమోదైన కేసులో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు.
దీంతో తొర్రూరు ఎక్సైజ్ అధికారులు, దంతాలపల్లి పోలీసులు కలిసి నిందితుడిని తొర్రూరు తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితుడికి రూ.70 వేల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా దంతాలపల్లి ఎస్‌ఐ రవికుమార్ మాట్లాడుతూ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం జరిమానా లేదా రిమాండ్ చర్యలు తప్పవని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!