ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు అధికారులు

5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు అధికారులు

📰 Generate e-Paper Clip

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహిం చారు. నిర్వహించిన ట్రాప్‌లో ఎస్‌ఐ జ్ఞానేం దర్‌రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంజనే యులు లంచం కేసులో పట్టుబడ్డారు.

పీడీఎస్‌ బియ్యం కేసుకు సంబంధించి బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడం తో పాటు భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా చూసేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడి తో ఎస్సై, సీఐ కలిసి రూ”8.35 లక్షలకు ఒప్పందం కుదుర్చుకునట్లు సమాచారం.

అయితే ఈ నెల 2 న బాధితుడీ నుండి 3.50 లక్షల రూపా యలు తీసుకున్నట్లు తెలిసింది, మిగతా డబ్బుల కోసం పోలీస్ అధికారుల వేధింపులు భరించ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు పక్క సమాచారం ప్రకారం…మిగతా 5 లక్షలు తీసుకునేం దుకు గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కీసర పెద్ద చెరువు వద్దకు వచ్చిన ఎస్సై, సీఐ ని,ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నా రు. కీసర పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీ లు చేపట్టారు. వీటితో పాటు పోలీస్ అధికా రుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!