గణపురం, ఆగస్టు 27 (పీపుల్స్ డైరీ):
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు మంద మహేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల్లో అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య సంబంధాన్ని నెలకొలిపే విధంగా విద్యార్థినులు ప్రతి విద్యార్థికి రాఖీ బంధాన్ని ఏర్పరిచారు. రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. ‘నాకు నువ్వు రక్ష.. నీకు నేను రక్ష.. మనమంతా మన దేశానికి రక్ష.. మేరా భారత్ మహాన్’ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు ఆకట్టుకున్నాయి. దేశ ఐక్యత, సమాజ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలనే సందేశాన్ని కార్యక్రమం ద్వారా అందించారు.
– చెల్పూర్ లో రక్షాబంధన్ వేడుకలు
మండలంలోని చెల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలుపుతూ నేటి సమాజంలో విద్యార్థిని, విద్యార్థులు ఏ విధంగా ఉండాలో వివరించారు. అనంతరం విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీలు కట్టుకుని ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. మనం దేశానికి రక్ష’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. రక్షాబంధన్ కేవలం సోదర, సోదరీమణుల అనుబంధానికి మాత్రమే కాకుండా సమాజంలో పరస్పర రక్షణ, ఐక్యత, దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రొద్బలం తో ఫ్రెండ్స్ యాత్ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపల్ లు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, బీజేపీ మండల నాయకులు మాదాసు మొగిలి, సోమ దామోదర్, డాకూరి కృష్ణా రెడ్డి, వడ్డం రాజశేఖర్, యోగా గురువు కుమార్, ఊర నవీన్ రావు, పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.

