ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeరాజకీయంకష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు

కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు

📰 Generate e-Paper Clip

బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా ప్రమోద్ గౌడ్

నల్లబెల్లి: పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే వారికి బీజేవైఎంలో సముచిత గుర్తింపు ఉంటుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ వీర్ అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన సుధాగాని ప్రమోద్ గౌడ్‌ను బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా భరత్ వీర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు, బాధ్యతలు లభిస్తాయని పేర్కొన్నారు. “బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగాలంటే బీజేపీలోనే మంచి అవకాశం ఉంటుంది. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుంది” అని అన్నారు.

జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్న సుధాగాని ప్రమోద్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువతను సంఘటితం చేసి, బీజేవైఎంను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువత సమస్యలపై నిరంతరం పోరాడుతానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!