విద్యుత్ షాక్తో మృతి చెందిన సిరివెన్నెల కుటుంబానికి పరామర్శ, ఆర్థిక సహాయం
నల్లబెల్లి:
నల్లబెల్లి గ్రామానికి చెందిన పిట్టల రమేశ్ కుమార్తె పిట్టల సిరివెన్నెల ఇటీవల విద్యుత్ షాక్కు గురై అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బత్తిని మహేష్ బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించారు.అనంతరం, ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం రూ. 5,000/-ల ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బత్తిని మహేష్ మాట్లాడుతూ… “సిరివెన్నెల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, వారి కుటుంబానికి ప్రజాప్రతినిధులుగా, పార్టీ పరంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని” తెలిపారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించి సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
