ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్బతుకమ్మలో పాటల పరిమళం ఎక్కడ..?

బతుకమ్మలో పాటల పరిమళం ఎక్కడ..?

📰 Generate e-Paper Clip

– చప్పట్ల చప్పుడు పోయింది.. డీజే మోత మిగిలింది!
– తంగేడు పూల మధ్య.. డీజే హోరు…!
– పల్లె పాటల స్థానంలో సినీ పాటల హోరు
– కనుమరుగవుతున్న తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాటలు
– పెద్దల నుంచి పిల్లలకు అందని పల్లె పాటల పరంపర

పీపుల్స్ డైరీ, గణపురం: ఒకప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెల్లో సందడే సందడి. ఇంటి ముందు రంగవల్లులు.. చేతుల్లో తంగేడు, గునుగు పూలు.. బతుకమ్మ చుట్టూ చేరిన ఆడపడుచులు.. గొంతెత్తి పాడే సంప్రదాయ పాటలు.. చప్పట్లతో మారుమోగే పల్లె వాకిళ్లు కనిపించేవి. కాలక్రమంలో ఈ దృశ్యాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలో డీజే సౌండ్లు, సినీ పాటలు చోటుచేసుకుంటున్నాయి. పండుగ ఏదైనా డీజే తప్పనిసరిగా మారడంతో బతుకమ్మ వేడుకల్లోనూ సంప్రదాయ పాటల కంటే డీజే హోరే ఎక్కువగా వినిపిస్తోంది. బతుకమ్మ పాటల్లో తెలంగాణ పల్లె జీవనం, ఆచారాలు, అనుబంధాలు, జానపద సంస్కృతి దాగి ఉన్నాయి. పెద్దలు పాడే పాటలను పిల్లలు నేర్చుకోవడం ద్వారా ఈ సంప్రదాయం తరతరాలకు కొనసాగేది. ప్రస్తుతం మారుతున్న అభిరుచులతో నాటి బతుకమ్మ పాటలు నేటి తరానికి దూరమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. తంగేడు పూల మధ్య డీజే మోత కంటే.. బతుకమ్మ పాటలే మళ్లీ మారుమోగాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!