ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బాధిత కుటుంబానికి అండగా ముచింపుల తండా సర్పంచ్ సతీమణి వసంత - రవీందర్ గౌడ్

బాధిత కుటుంబానికి అండగా ముచింపుల తండా సర్పంచ్ సతీమణి వసంత – రవీందర్ గౌడ్

📰 Generate e-Paper Clip

బాధిత కుటుంబానికి అండగా ముచింపుల తండా సర్పంచ్ సతీమణి వసంత – రవీందర్ గౌడ్

నల్లబెల్లి అక్టోబరు12 (పీపుల్స్ డైరీ)

నల్లబెల్లి మండల పరిధిలోని ముచింపుల తండా గ్రామపంచాయితీ సిబ్బందిలో ఒకరైన శనిగరం సాంబయ్య తండ్రి శనిగరం రాజయ్య ఆదివారం మృతి చెందాడు.. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సతీమణి మచ్చిక వసంత – రవీందర్ గౌడ్ బాధితుని ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. శనిగరం రాజయ్య మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కష్ట సమయంలో “మేమున్నామంటూ” బాధితుల కుటుంబానికి కొండంత అభయాన్ని ఇచ్చిన వసంత, వారి కుటుంబానికి ₹5,000/- (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ SMC చైర్మన్ భూక్య శ్రీనివాస్, వార్డు మెంబర్ భూక్య శ్రీలత, గ్రామానికి చెందిన పలువురు నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొని శనిగరం రాజయ్యకు నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!