ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeతెలంగాణమూడు చెక్కలపల్లిలో అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం: వర్షాకాలం ముందస్తు చర్యలు 

మూడు చెక్కలపల్లిలో అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం: వర్షాకాలం ముందస్తు చర్యలు 

📰 Generate e-Paper Clip

మూడు చెక్కలపల్లిలో అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం: వర్షాకాలం ముందస్తు చర్యలు

నల్లబెల్లి పీపుల్స్ డైరీ

రానున్న వర్షాకాలంలో గ్రామ ప్రజలకు రాకపోకల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నల్లబెల్లి మండల పరిధిలోని మూడు చెక్కలపల్లి గ్రామ పంచాయతీలో ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని అంతర్గత మట్టి రోడ్లపై మట్టి మరియు మొరము పోయించి రోడ్లను బాగు చేయించారు.గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వర్షాలు పడితే రోడ్లు బురదమయంగా మారి ప్రజలు, పాఠశాల విద్యార్థులు, వాహనదారులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ రోడ్ల మరమ్మతు కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు స్థానిక నాయకులు, గ్రామస్థులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ రవి, బోడ సురేష్ మరియు గ్రామ వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సమస్యలపై త్వరితగతిన స్పందించి, వర్షాకాలానికి ముందే అంతర్గత రోడ్లను సిద్ధం చేయించినందుకు గాను మూడు చెక్కలపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్ కవిత దేవు నాయక్ మరియు తోడ్పాటు అందించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!